హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మునిసిపల్ ఎన్నికలకు సిద్దమవుతోందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని, మున్సిపల్ ఎన్నికలలో 50 శాతం చైర్మన్ పదవులను కైవసం చేసుకుంటామని దీమా వ్యక్తం చేశారు. గాంధీభవన్ లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడిని మార్చడం అనవసరమన్నారు. ఉ త్తమ్ కుమార్ రెడ్డినే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించాలని కుంతియాకు చెప్పినట్టు వెల్లడించారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం చాలా మంది పోటీ పడుతున్నారని, వీళ్లంతా సమర్థులేనని చెప్పారు. ప్రాంతీయ పార్టీల్లో
అధికారంలోకి చ్చినా పదవి ఆశించను